
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్
చందుర్తి(వేములవాడ): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. చందుర్తి మండలం రామరావుపల్లి గ్రామపచాయతీ కార్యాలయం ఎదురుగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి పనులను గురువారం పరిశీలించారు. గ్రామంలో వీధికుక్కలను నియంత్రించాలని పంచాయతీ కార్యదర్శికి, మండల అధికారులకు సూచించారు. సనుగులలో రోడ్డుకు ఇరువైపులా పెరిగిన గడ్డిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. సీసీరోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మర్రిగడ్డలోని ఫర్టిలైజర్ దుకాణం, చందుర్తి, సనుగుల సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో ఉన్న ఎరువుల గోదాంలను తనిఖీ చేశారు. ఎరువుల కొరత సృష్టిస్తే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం తదితరులు ఉన్నారు.