
వంతెన పనులకు భూసేకరణ
వేములవాడ: వేములవాడ మూలవాగులో నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి విస్తరణ పనుల్లో భాగంగా తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు రెవెన్యూ అధికా రులు ఆదివారం రాత్రి రెండు జేసీబీలను అందుబాటులో ఉంచారు. వారం రోజుల క్రితమే రెవెన్యూ అధికారులు భవన యజమానులకు నోటీస్‌లు ఇచ్చారు. రెండో వంతెన పనులు పూర్తి చే సేందుకు ఈ విస్తరణ పనులు చేపడుతున్నట్లు అ ధికారులు పేర్కొంటున్నారు. నెల రోజుల క్రితం మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 150కి పైగా నిర్మాణాలను తొలగించిన విషయం తెలి సిందే. దీంతో రెండోసారి చేపడుతున్న విస్తరణ పనులతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది.