వయోవృద్ధుల రక్షణకు చట్టాలు
సిరిసిల్లటౌన్: వయోవృద్ధుల పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధికాజైశ్వాల్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని ఇందిరాపార్కులో వయోవృద్ధుల పోషణ, రక్షణ నిర్వహణ చట్టం–2007పై శుక్రవారం అవగాహన కల్పించారు. అనాథలైన వృద్ధులకు ప్రభుత్వం ఆశ్రమాల్లో నీడ కల్పిస్తుందని తెలిపారు. తల్లిదండ్రుల బాధ్యతను పిల్లలు చూసుకోవాలని ఇందుకు ప్రత్యేక చట్టా లు ఉన్నాయన్నారు. మహిళల రక్షణ, గృహహింస చట్టాలను వివరించారు. లోక్ అదాలత్ మెంబర్ చింతోజు భాస్కర్, ఆడెపు వేణు పాల్గొన్నారు.
● సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైశ్వాల్


