
ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
కోనరావుపేట(వేములవాడ): జూలై 7న నిర్వహించే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల భిక్షపతి కోరారు. కోనరావుపేటలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాలతో గురువారం సమావేశమయ్యారు. మండలకేంద్రంలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దె భూమిపూజ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొమ్ము రా జశేఖర్, జిల్లా సీనియర్ నాయకులు ఖానాపూర్ లక్ష్మణ్, మంగళి చంద్రమౌళి, కుమ్మరి రవి, బొడ్డు ప్రభాకర్, బాబు, సురేశ్, తైదల రాజయ్య, చంద్రయ్య, శ్రీనివాస్, తాండ్రా ప్రతాప్, ఎనగందుల రాజు, మోహన్ ఉన్నారు.