ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై చర్యలు
● ఎంవీఐ వంశీధర్
ముస్తాబాద్(సిరిసిల్ల): మోటారు వాహనాల చట్టం నిబంధనలు పాటించని స్కూల్ బస్సులపై చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల ఎంవీఐ వంశీధర్ హెచ్చరించారు. ముస్తాబాద్ మండలంలో ప్రైవేటు పాఠశాలల స్కూల్ బస్సులను గురువారం తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్న ఓ పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం స్కూల్ యాజమాన్యాలు నడచుకోవాలని సూచించారు. సహాయక ఎంవీఐ రజనీ, కానిస్టేబుళ్లు సౌమ్య, ప్రశాంత్, రమ్య పాల్గొన్నారు.
ముసురు వాన
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా గురువారం ముసురువానలు కురిశాయి. కోనరావుపేటలో అత్యధికంగా 8.7 మిల్లీమీటర్లు, రుద్రంగిలో 0.7, చందుర్తిలో 5.0, వేములవాడ రూరల్‌లో 4.5, బోయినపల్లిలో 8.0, వేములవాడలో 7.2, సిరిసిల్లలో 3.9, వీర్నపల్లిలో 3.1, ఎల్లారెడ్డిపేటలో 1.7, గంభీరావుపేటలో 0.5, ముస్తాబాద్‌లో 2.5, తంగళ్లపల్లిలో 0.5, ఇల్లంతకుంటలో 1.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.


