సంఘం స్థలం స్వాహాకు యత్నం? | - | Sakshi
Sakshi News home page

సంఘం స్థలం స్వాహాకు యత్నం?

May 29 2025 1:25 AM | Updated on May 29 2025 1:25 AM

సంఘం స్థలం స్వాహాకు యత్నం?

సంఘం స్థలం స్వాహాకు యత్నం?

వేములవాడ: పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ స్థలం విషయంలో వివాదం ఏర్పడి పంచాయితీ ఎస్పీ వద్దకు చేరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సుమారు 1800 సభ్యుల సంకల్పంతో 2011లో సర్వే నం.977లో 968 గజాల స్థలం కొనుగోలు చేశారు. సంఘం అధ్యక్షుడు, కార్యవర్గం పేరుపై ఉండాల్సిన భూమిని 12 మంది ప్రముఖులు ఓ ట్రస్టుగా ఏర్పడి తమ పేరుతో రిజిస్త్రేషన్‌ చేయించుకోవడంతో వివాదం చెలరేగింది. సంఘ సభ్యుల హితాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్‌లో సేవా కార్యక్రమాల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొన్న ఈ స్థలంలో 12 మంది ప్రముఖులు తామే యజమానులమని గత డిసెంబర్‌లో తమ పేతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు వెలుగు చూసింది. దీంతో సంఘ సభ్యులంతా తీవ్ర ఆగ్రహానికి లోనై ఇది కేవలం ఆస్తిపై మాత్రమే కాదు మన ఆర్యవైశ్యుల ఆత్మగౌరవంపై దాడి అంటూ పట్టణానికి చెందిన 1800 మంది సభ్యుల నమ్మకాన్ని, ఆశలను తాకట్టు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ అంశంతో ఆర్యవైశ్య ప్రముఖులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్‌దారులు కాంప్రమైజ్‌ అవుతామనీ, తమపై ఉన్న రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకుని తిరిగి సంఘానికి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదం బుధవారం వేములవాడలో సామాజికంగా కీలకమైన అంశంగా మారింది. వైశ్య సంఘం న్యాయబద్ధంగా తమ హక్కులను తిరిగి పొందుతుందా? లేక ఈ ప్రయత్నం వ్యర్థమవుతుందా? అన్న చర్చ కొనసాగింది.

వేములవాడలో

ఆర్య వైశ్య సంఘ భూవివాదం

ఎస్పీ వద్దకు చేరిన పంచాయితీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement