
ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి
రామగిరి(మంథని): భర్త అనారోగ్యం.. ఆర్థికలేమి.. ముగ్గురు పిల్లలు పోషణ.. కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఆ గృహిణికి తలకుమించిన భారంగా మారింది. దాతలు సాయం చేస్తే భర్తకు మంచి వైద్యచికిత్స అందిస్తామని, పిల్లల పోషణ చూసుకుంటానని అంటోంది ఆ గృహిణి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన దుబ్బాక కుమార్ – విజయ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం కిరణ్, మహేందర్, చెర్రీ ఉన్నారు. అనారోగ్యానికి గురైన కుమార్.. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. అయినా నయం కాలేదు. తనకున్న స్థోమత వరకు ఖర్చుచేశాడు. చేతిలో ఉన్న సొమ్మంతా ఖర్చు కావడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లడానికి చిల్లిగవ్వకూడా లేకుండాపోయింది. కనీసం ప్రయాణానికి కూడా డబ్బులు లేని దీనస్థితిలో ఆ కుటుంబం ఉంది. విజయ కూలీ పనులకు వెళ్లి అంతోఇంతో సంపాదిస్తున్నా కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదు. దాతలు ముందుకు వచ్చి తన భర్తను కాపాడాలని విజయ కోరుతోంది.
రెండు కిడ్నీలు పనిచేయక
యువకుడి నరకయాతన