
మహిళా ఉద్యోగుల బోయినపల్లి
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలంలో మహిళా అధికారులు, ఉద్యోగులు అధికంగా ఉన్నారు. రెవెన్యూ, మండల పరిషత్, ఐకేపీ, ఉపాధిహామీ, వైద్య, వ్యవసాయ శాఖల్లో కొలువు దీరారు. ఎంపీడీఓగా భీమ జయశీల, డెప్యూటీ తహసీల్దార్‌గా దివ్యజ్యోతి, మండల వ్యవసాయ అధికారిగా కె.ప్రణిత, ఈజీఎస్ ఏపీవోగా వనం సబిత, ఐకేపీ ఏపీఎంగా జయసుధ, విలాసాగర్, కొదురుపాక పీహెచ్‌సీల్లో వైద్యులుగా అనిత, రేణుప్రియాంక.. ఇలా పలు విభాగాల్లో మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
అంకిత భావంతో విధులు
పంచాయతీరాజ్ శాఖలో వీడీవో, పంచాయతీ కార్యదర్శి, ఈఓపీఆర్డీగా పని చేసి ఇప్పుడు ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్నా. వివిధ మండలాల్లో ప్రజలతో మమేకమై అనేక అభివృద్ధి పనుల్లో పాలు పంచుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిది.
– బీమా జయశీల, ఎంపీడీవో, బోయినపల్లి
వ్యవసాయంపై మక్కువ
వ్యవసాయ అధికారిగా అనేక మండలాల్లో రైతులకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చిన. పని చేసిన ప్రతీ చోట క్షేత్రస్థాయిలో పంట పొలాలు సందర్శించి రైతుల సాధక బాధకలు గుర్తించడం సంతృప్తినిస్తోంది.
– కె.ప్రణిత, ఎంఏవో, బోయినపల్లి

మహిళా ఉద్యోగుల బోయినపల్లి

మహిళా ఉద్యోగుల బోయినపల్లి