
బోయినపల్లిలోని కొనుగోలు కేంద్రంలో శెనగలను ఆరబెడుతున్న రైతులు
ఉపవాసంతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు. పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే ఇస్లాం ఉద్దేశం.
– మహమ్మద్ ప్రవక్త
శెనగలు కొనేదెప్పుడో?
బోయినపల్లి(చొప్పదండి): శెనగ రైతుల కష్టాలు తీరడం లేదు. శెనగ పంట చేతికొచ్చిన అకాల వర్షాలతో తేమశాతం రాక కొనుగోళ్లు మొదలు కాలేదు. దీంతో పంట అమ్ముకునేందుకు రైతులకు ఎదురుచూపులే దిక్కయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 300 ఎకరాలలో శెనగ పంట సాగుచేశారు. జిల్లాలో శెనగల కొనుగోలుకు ఒకే కేంద్రాన్ని బోయినపల్లిలో ఏర్పాటు చేశారు. పంట చేతికి రావడంతో ఇటీల రైతులు కేంద్రానికి తీసుకొస్తున్నారు. అయితే వర్షాలు పడుతుండడంతో తేమశాతం రాక పూర్తిస్థాయిలో కొనుగోళ్లు మొదలుకాలేదు. గురువారం ఒక్క రోజు తూకం వేసిన అధికారులు వాటిని తరలించకుండా అక్కడే ఉంచేశారు. మిగతా రైతులవి కేంద్రంలోనే ఉన్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఒకే కేంద్రం..
జిల్లా వ్యాప్తంగా బోయినపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో శెనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈనెల 14వ తేదీన శెనగల కొనుగోలు కేంద్రాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. వరుసగా వర్షాలు పడడంతో కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో ప్రతీ రోజు రైతులు కొనుగోలు కేంద్రానికి వచ్చిన శెనగ కుప్పలపై కవర్లు కప్పి వెళ్తున్నారు. మళ్లీ ఉదయం వచ్చి కవర్లు తీసి ఆరబెడుతున్నారు. ఇలా పదిహేను రోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది.
300 ఎకరాల్లో సాగు
జిల్లాలోని బోయినపల్లి, రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడరూరల్ మండలాల్లో దాదాపు 300 ఎకరాల్లో శెనగ పంట సాగుచేశారు. జిల్లాలో సుమారు 250 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్వింటాల్‌కు రూ.5,335 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తోంది. శెనగల కొనుగోలుకు 14 తేమ శాతం ఉండాలని అధికారులు నిబంధన పెట్టారు. శెనగ పంట వేసినప్పుడు సరైన వర్షాలు పడక విత్తనాలు సరిగ్గా మొలవలేదని దీంతో దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన పడుతున్నారు. ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్ల మేర మాత్రమే దిగుబడి వచ్చిందని వాపోయారు. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు సురేశ్, సుబ్బారావు తెలిపారు. శెనగలు వర్షంలో తడిస్తే ఫంగస్ వచ్చి నల్లబడుతుందని.. అందుకే నిత్యం కేంద్రం వద్ద కాపలా ఉంటూ తడవకుండా చూస్తున్నామని చెప్పారు. వర్షంతో శెనగల కొనుగోలు ఆలస్యమైందని, ప్రస్తుతం కొనుగోళ్లు చేపడుతున్నట్లు బోయినపల్లి డీసీఎంఎస్ సెంటర్ ఇన్‌చార్జి నర్సింహారావు తెలిపారు.
సాగు విస్తీర్ణం : 300 ఎకరాలు
కొనుగోలు కేంద్రాలు : 01
మద్దతు ధర : రూ.5,335
దిగుబడి అంచనా : 250 మెట్రిక్‌టన్నులు
వర్షంతోనే భయం
శెనగ పంట వేసుడే ఒక ఎత్తయితే.. అమ్ముకోవడం మరో ఎత్తులా ఉంది. రోజూ సాయంత్రం కాగానే మొగులు అవుతుంది. వర్షం పడుతుందని భయం అవుతుంది. సెంటర్‌లో ఆరు క్వింటాళ్ల మేర శెనగలు పోశాను.
– పెగ్గెర్ల యాదగిరి, బోయినపల్లి
దిగుబడి తగ్గింది
ఐదెకరాలను కౌలుకు తీసుకొని శెనగ పంట వేసిన. మొదట్లో వర్షాలు కురువక విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి పెడితే 3 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చింది. ఇప్పుడు శెనగపంట చేతికొచ్చి సెంటర్‌లో పోశాక వర్షాలు పడుతున్నాయి.
– సుబ్బారావు, బూర్గుపల్లి
కొనుగోళ్లు చేపడుతున్నాం
జిల్లాలో 300 ఎకరాల్లో శెనగ సాగు చేశారు. 250 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పుడు బోయినపల్లి ఏఎంసీలో శెనగల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాం. సెంటర్ ప్రారంభించిన తర్వాత వర్షాలు పడడంతో కొనుగోళ్లు చేపట్టలేదు. ఇప్పుడు కొనుగోళ్లు మొదలయ్యాయి. రుద్రంగిలో సైతం సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది.
– దివ్యభారతి, డీఎం, మార్క్‌ఫెడ్, సిరిసిల్ల
సహర్4:51
ఆది
ఇఫ్తార్ 6:32
శ ని
జిల్లాలో ఒకే ఒక కేంద్రం
జిల్లాలో 300 ఎకరాల్లో సాగు
సరైన దిగుబడి లేక రైతుల ఆవేదన
తేమ రాక తిప్పలు
జిల్లా సమాచారం


అరుణకు పత్రిక అందిస్తున్న ఉద్యోగులు

నామినేషన్ వేస్తున్న అన్నపూర్ణ


