
సింగిల్‌విండో ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు
● సింగిల్‌విండో ఎదుట బీజేపీ ధర్నా
ముస్తాబాద్(సిరిసిల్ల): ఫసల్‌బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతూ మండలంలోని పోతుగల్ సింగిల్‌విండో కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు శుక్రవారం ధర్నా చేపట్టారు. బీజేపీ మండలాధ్యక్షుడు కస్తూరి కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఫసల్‌బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు రైతులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులకు బీమా పరిహారం దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వరి వెంకటేశ్, కోల కృష్ణ, క్రాంతి, అంజాగౌడ్, సంజీవ్, రాంగోపాల్, మల్లారెడ్డి, గోపి, నరేశ్, చిగురు వెంకన్న, కల్యాణ్, ఉపేంద్ర, శేఖర్, రాజ్‌కిరణ్, వెంకటేశ్, సాయి, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.