
సూచనలిస్తున్న కలెక్టర్ అనురాగ్ జయంతి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో చేపట్టిన ఆధునికీకరణ పనులు అంబేద్కర్ జయంతిలోపు పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ బాలుర వసతిగృహాన్ని, మోడల్‌స్కూల్, కేజీబీవీలను శుక్రవారం సందర్శించారు. వసతిగృహంలో రూ.25లక్షలతో చేపట్టిన టాయిలెట్స్, వంటగది, డైనింగ్‌హాల్, లైబ్రరీ, పెయింటింగ్, కొత్త తలుపుల ఏర్పాటు, దోమల బెడద నివారణకు జాలీల ఏర్పాటు పనులు, లీకేజీలను అరికట్టే పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కేజీబీవీలోని వంటకాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. మినరల్ వాటర్‌ప్లాంట్, టాయిలెట్ బ్లాక్‌లను పరిశీలించారు. త్వరలోనే ఐఐటీ, జేఈఈ మెటీరియల్‌ను లైబ్రరీలో అందుబాటులో ఉంచుతామన్నారు. డీఈవో రమేశ్‌కుమార్, ప్రిన్సిపాల్స్ రమేశ్, వసంత, వసతిగృహం సంక్షేమాధికారి రాంచంద్రారెడ్డి, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ నారాయణరావు పాల్గొన్నారు.
కలెక్టర్ అనురాగ్ జయంతి