
ఎల్లారెడ్డిపేటలో ధర్నా చేస్తున్న నాయకులు
● గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ధర్నా
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎన్నికల సభలో ప్రధాని మోదీ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మాట్లాడినందుకు రాహుల్‌గాంధీకి కోర్టు శిక్ష విధించడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని గాంధీ విగ్రహం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నిరసన తెలిపారు. రాహుల్‌గాంధీ పాదయాత్రకు పెరుగుతున్న అభిమానాన్ని చూడలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు. పందిర్ల లింగంగౌడ్, సద్ది లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజునాయక్, రాంరెడ్డి, దేవయ్య, బాలయ్య, ఇమామ్, కిషన్, రమేశ్, సంతోష్‌గౌడ్, తిరుపతిరెడ్డి, బాబు, రవి, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
ఇల్లంతకుంట(మానకొండూర్): గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఇల్లంతకుంటలోని రైతువేదికలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ పంచాయతీరాజ్ మండలస్థాయి అవార్డులను శుక్రవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి వేలాది కోట్లు మంజూరు చేస్తున్నారన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించినట్లు తెలిపారు. జెడ్పీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు, ఎంపీపీ వెంకటరమణారెడ్డి, ఎంపీడీవో మీర్జా ఉన్నారు.

అవార్డులు అందజేస్తున్న ఎమ్మెల్యే