సైబర్‌నేరగాళ్లకు చిక్కిన యువతులు
కోనరావుపేట(వేములవాడ): సైబర్ నేరగాళ్లు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. బంధువుల పేరుతో చాటింగ్ చేసి డబ్బుల లాగుతున్నారు. డబ్బులు వారికి చేరడంతోనే ఆ నంబర్ నుంచి మెస్సేజ్ రావడం ఆగిపోతుంది. మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. కోనరావుపేట మండలానికి చెందిన ఓ యువతికి ఆమె బంధువు పేరిట మెస్సేజ్ వచ్చింది. తన ఖాతా పరిమితి దాటిపోయిందని అర్జంటుగా రూ.10 వేలు పంపమని మెస్సేజ్ పెట్టాడు. దగ్గరి బంధువే కదాని డబ్బులు పంపింది. డబ్బులు పంపిన వెంటనే లైన్ కట్ అయింది. బంధువుకు ఫోన్ చేయగా తాను కాదని చెప్పడంతో మోసపోయినట్లు తెలుసుకున్నారు. మరో మహిళకు కూడా ఇలాగే మెస్సేజ్ రావడంతో ఆమె రూ.2 వేలు పంపింది. వీరు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి మెస్సేజ్‌లు వస్తే ఎవరూ స్పందించవద్దని పోలీసులు కోరుతున్నారు.