
మొక్క నాటుతున్న జిల్లా ఎస్పీ
● ఎస్పీ అఖిల్ మహాజన్
చందుర్తి(వేములవాడ): పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూ చించారు. చందుర్తి సర్కిల్ కార్యాలయంతోపాటు చందుర్తి పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. సీఐ కార్యాలయం ఎదుట మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 5ఎస్ ఇంప్లిమెంటేషన్, ఫంక్షనల్ వర్టికల్స్ పనితీరు, సిబ్బంది నామినల్ రోల్స్, హెచ్‌ఆర్‌ఎంఎస్, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌లో ఫైళ్లను సక్రమమైన పద్ధతిలో ఉంచాలన్నారు. ఠాణాలో ఉన్న వాహనాల ఆర్సీ పేపర్లను తీసుకొచ్చి వాహనాలకు తీసుకెళ్లాలని యజమానులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్పీ మాట్లాడు తూ ఫిర్యాదులను వెంటనే స్పందించాలని సూచించారు. వాహనాల తనిఖీ, డ్రంకెన్‌డ్రైవ్‌లు చేపట్టాలన్నారు. సీఐ కిరణ్‌కుమార్, ఎస్సై రమేశ్ ఉన్నారు.
ఐక్యతతో పండుగలు నిర్వహించాలి
సిరిసిల్లక్రైం: కులమతాలకతీతంగా ప్రజలందరూ ఐక్యంగా పండుగలు చేసుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు. రంజాన్‌ను పురస్కరించుకొని సిరిసిల్లటౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో గురువారం వివిధ మతపెద్దల సమక్షంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పండుగలను జరుపుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే విద్వేషపూరిత పుకార్లను నమ్మవద్దని కోరారు. సిరిసిల్ల డీఎస్పీ విశ్వప్రసాద్, తహసీల్దార్ విజయ్‌కుమార్, ట్రాఫిక్ ఎస్సై రాజ్‌కుమార్ పాల్గొన్నారు.