
అవగాహన కల్పిస్తున్న రోజా
● సఖి సెంటర్ ఇన్‌చార్జి రోజా
కోనరావుపేట (వేములవాడ): బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ‘సఖి’ సెంటర్ సిరిసిల్ల నిర్వాహకురాలు రోజా అన్నారు. మండలకేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నా ‘181’ నెంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ఫోక్సో, సైబర్ నేరాలు, బా లికా సంరక్షణ చట్టాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సాగర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ గంగలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించాలి
చందుర్తి (వేములవాడ): విద్యార్థుల్లో భాష, గణిత సామర్థ్యాలను పెంపొందించాలని తొలిమెట్టు రాష్ట్ర పరిశీలకుడు పెరుమాండ్ల శ్రీనివాస్ కోరారు. గురువారం మండలంలోని ప్రాథమిక పాఠశాలను తొలిమెట్టు రాష్ట్ర పరిశీలకుల బృందం తనిఖీ చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపట్టికలను పరిశీ లించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయుడు వికృర్త లక్ష్మీ నారాయణ, రొండి చంద్రకళ, ఉపాధ్యాయులు నరేశ్, ముఖేశ్, రవి,మమత, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పీహెచ్‌సీకి
ఎన్–క్వాస్ సర్టిఫికెట్
● అభినందించిన కలెక్టర్
అనురాగ్ జయంతి
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలోని పుచ్చలపల్లి సుందరయ్యనగర్ పీహెచ్‌సీకి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్ట్ సర్టిఫికెట్ వరించింది. ఈమేరకు గురువారం ఽఎన్–క్వాస్ నుంచి సర్టిఫికెట్ అందింది. ఈసందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ గతంలో వేములవాడ, తంగళ్లపల్లి, కోనరావుపేట మండలాల్లోని పీహెచ్‌సీలకు ఎన్–క్వాస్ సర్టిఫికెట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. సిరిసిల్ల పీఎస్‌నగర్ అర్బన్‌హెల్త్ సెంటర్‌కు కూడా ఎన్–క్వాస్ గుర్తింపు రావడంపై జిల్లా వైద్యశాఖ, యూహెచ్‌సీ సిబ్బందిని అభినందించారు. మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లాలో పేదలకు సర్కారు వైద్యం నాణ్యతా ప్రమాణాలతో అందుతుందన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రులోల మౌలిక వసతులు పెరిగాయని, ఆధునిక వైద్య పరికరాల అందుబాటులో ఉండటంతో ఓపి, ఐపీ, సర్జికల్ విభాగాల్లో రోగుల తాకిడి పెరిగిందన్నారు.
ఆన్‌లైన్‌లో టెన్త్ హాల్‌టికెట్స్
● డీఈఓ రమేశ్
సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్‌టికెట్స్ శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని డీఈవో రమేశ్ గురువారం ప్రకటనలో తెలిపారు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయని విద్యార్థులు వారి కేంద్రాలను ఆన్‌లైన్ నుంచి తీసుకున్న హాల్‌టికెట్స్‌తో పరీక్షకు హాజరుకావాలని తెలిపారు.

విద్యార్థుల గ్రేడ్లను పరిశీలిస్తున్న పెరుమాండ్ల శ్రీనివాస్