గుడుంబా అమ్మితే రూ.లక్ష ఫైన్‌ | - | Sakshi
Sakshi News home page

గుడుంబా అమ్మితే రూ.లక్ష ఫైన్‌

Mar 24 2023 5:46 AM | Updated on Mar 24 2023 5:46 AM

 బెల్లం పానకం ధ్వంసం చేస్తున్న అధికారులు (ఫైల్‌)
 - Sakshi

బెల్లం పానకం ధ్వంసం చేస్తున్న అధికారులు (ఫైల్‌)

● ఏడాదిలో 512 మంది బైండోవర్‌ ● 43 మంది నుంచి రూ.39లక్షలు వసూలు ● 29 మందిపై కేసులు.. ముగ్గురికి జైలు ● గుడుంబా కట్టడికి సర్కార్‌ వ్యూహం ● అయినా ఆగని తయారీ, విక్రయాలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పల్లెలను గుడుంబా రహితంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. నాటుసారా తయారీ, విక్రయాలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఎకై ్సజ్‌ అధికారులు పల్లెల్లో గుడుంబా తయారీదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. గుడుంబా విక్రయిస్తూ ఒక్కసారి బైండోవర్‌ అయిన వ్యక్తి తిరిగి సారా అమ్ముతూ పట్టుబడితే రూ.లక్ష జరిమానా చెల్లించేలా నియమాలు రూపొందించారు. జరిమానా చెల్లించకుంటే జైలుశిక్ష అనుభవించాల్సిందే. జిల్లాలో ఏడాదిలో 512 మందిని బైండోవర్‌ చేశారు.

రూ.39 లక్షలు వసూలు

రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 255 గ్రామపంచాయతీలలో సుమారు 127 పంచాయతీల పరిధిలో గుడుంబా విక్రయాలు సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సారా విక్రయాలు ఎక్కువగా ఉన్న తండాలు, పల్లెలపై నిఘా పెట్టారు. ఏడాదిలో ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్‌ పరిధిలోని వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్‌, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో గుడుంబా స్థావరాలపై దాడులు చేసి వివిధ కేసుల్లో 512 మందిని ఆయా మండలాల్లోని తహసీల్దార్ల ఎదుట బైండోవర్లు చేశారు. గుడుంబా విక్రయిస్తూ పట్టుబడ్డ 29 మందిపై కేసులు నమోదు చేశారు. 512 మందిలో తిరిగి నేరాలకు పాల్పడ్డ 43 మందిని పట్టుకొని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించగా, 40 మంది రూ.39 లక్షల జరిమానాలు చెల్లించారు. మిగతా ముగ్గురు ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

మళ్లీ అమ్మితే జైలుకే..

గుడుంబా తయారీ, అమ్మకాల్లో పట్టుబడిన వ్యక్తులను ఎకై ్సజ్‌ అధికారులు తహసీల్దార్ల ముందు మొదటి హెచ్చరికగా పలు షరతులతో బైండోవర్‌ చేస్తున్నారు. ఏడాదిలో వారు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఒప్పంద పత్రాలు పలు షరతులతో తీసుకొని వదిలేస్తారు. అయితే బైండోవర్లు చేసిన వారి కదలికలపై అధికారులు నిఘా ఉంచుతారు. ఈ ఏడాదిలో తిరిగి వారు ఎలాంటి గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడిన వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్‌శాఖ పరిధిలో బైండోవర్లు చేసిన 512 మందిలో నేరాలకు పాల్పడ్డ 43 మందిని అరెస్ట్‌ చేశారు. బైండోవర్‌ల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.లక్ష జరిమానా చెల్లించడం లేదంటే జైలుకు వెళ్లడం జరిగింది. బైండోవర్లను ఆషామాషిగా తీసుకోవద్దని అధికారులు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఆగని దందా..

జిల్లాలో ఇలాంటి కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ నాటు సారా తయారీ, విక్రయాలకు బ్రేక్‌ పడడం లేదు. ఓ వైపు లక్షల్లో జరిమానాలు చెల్లిస్తున్నా.. జైలుశిక్షలు పడుతున్న గుడుంబా తయారికీ పూర్తిస్థాయిలో దూరం కావడం లేదు. జిల్లాలోని కేవలం ఎల్లారెడ్డిపేట సర్కిల్‌లోనే 512 మందిని బైండోవర్లు చేసినప్పటికీ మళ్లీ తిరిగి సారాయి బాటనే పడుతున్నారు. ఇప్పుడు మాత్రం ఎలాంటి ఉపేక్ష లేకుండా ప్రభుత్వం బైండోవర్లు అయిన వ్యక్తుల నుంచి రూ.లక్ష వసూలు లేదంటే జైలుకు పంపుతున్నారు. ఓ వైపు ఇలాంటి కఠినమైన శిక్షలు పడుతుంటే మరోవైపు నేరాలకు పాల్పడుతున్నారు. గతేడాది బైండోవర్‌ చేసిన ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌, వెంకటాపూర్‌ గ్రామాలకు చెందిన భూక్య కళ, జాగిరి ఎల్లయ్యలు గుడుంబా అమ్ముతూ పట్టుపడగా వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. గత మంగళవారం ఇద్దరి నుంచి రూ.లక్ష చొప్పున జరిమానా చెల్లించారు. జరిమానా రూపంలో వచ్చిన సొమ్మును అధికారులు ప్రభుత్వ ఖజా నాలో జమచేశారు. ఇలా బైండోవర్లు చేసిన వ్యక్తులు తిరిగి నేరాలు చేస్తూ డబ్బులు చెల్లిస్తున్నారు. గుడుంబా అమ్మితే జరిగే పరిణామాలు, శిక్షలు, జరిమానాల చెల్లింపులు, జైలుశిక్షలపై పోలీసు, ఎకై ్సజ్‌శాఖల అధికారులు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

బైండోవర్లను ఆషామాషీగా తీసుకోవద్దు

గుడుంబా, గంజాయి నేరాల్లో చేసే బైండోవర్లను ఎవరూ ఆషామాషిగా తీసుకోవద్దు. నాటుసారా లేని సమాజం కోసం ప్రభుత్వం కఠిన శిక్షలు అమలు చేస్తోంది. బైండోవర్‌ చేసిన వ్యక్తులపై ఎప్పుడూ నిఘా ఉంటుంది. వారు తిరిగి నేరాలకు పాల్పడితే షరతుల ప్రకారం రూ.లక్ష జరిమానా లేదంటే, జైలుశిక్ష అనుభవించాల్సిందే. ఇందులో ఎవరికి మినహాయింపు ఉండదు. ప్రభుత్వ నిషేధిత గుడుంబా, గంజాయి లాంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలి. – ఎంపీఆర్‌ చంద్రశేఖర్‌,

ఎకై ్సజ్‌ సీఐ, ఎల్లారెడ్డిపేట

 జరిమానా చెల్లిస్తున్న నిందితురాలు (ఫైల్‌)
1
1/2

జరిమానా చెల్లిస్తున్న నిందితురాలు (ఫైల్‌)

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement