
మాట్లాడుతున్న శ్రీధర్
● యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్
సిరిసిల్ల ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయుల కృషి చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ అన్నారు. జిల్లాకేంద్రంలో గురువారం జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపు తగ్గిస్తూ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకుండా నాణ్యమైన విద్యను పేదలకు దూరం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం పేరుతో విద్యా కార్పొరేటీకరణకు బాటలు వేస్తుందని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పాకాల శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా గుండమనేని మహేందర్ రావు, ఉపాధ్యక్షులుగా అంబటి రమేశ్, కోశాధికారి పర్కాల రవీందర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ వంగ మల్లేశం, జిల్లా కార్యదర్శులు అడేపు శివకుమార్, పాముల స్వామిగౌడ్, కొత్వాల్ ప్రవీణ్ పాల్గొన్నారు.