
సిరిసిల్లఅర్బన్: రాజస్థాన్‌లోని పాళీలో ఈనెల 25న జరిగే 47వ జాతీయ స్థాయి యోగా పోటీలకు సిరిసిల్లకు చెందిన తిప్పరవేణి స్వప్న ఎంపికయ్యారు. స్వప్నను మున్సిపల్ చైరపర్సన్ జిందం కళ, రాష్ట్ర పవర్ లూమ్, టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ సన్మానించారు.
ఆయుర్వేద వైద్యంలో లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు
ముస్తాబాద్(సిరిసిల్ల): ఆయుర్వేద సంప్రదాయ వైద్యాన్ని గ్రామీణ ప్రజలకు రెండు దశాబ్దాలుగా అందిస్తున్న గూడెంకు చెందిన డాక్టర్ రుద్రమణి శివాచార్య లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అ వార్డు అందుకున్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విశ్వశ్రీ ఫౌండేషన్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో బుధవారం ఉగాది వేడుకలు నిర్వహించారు. రుద్రమణి తన ఇంటి వద్దె అనేక ఔషధ మొక్కలు పెంచుతూ సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యాన్ని అందిస్తున్నందుకు అవార్డును అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అంజన్నను దర్శించుకున్న జెడ్పీ చైర్‌పర్సన్
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం అంజన్నను బుధవారం జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేశారు.
ప్రజలు సుభిక్షంగా ఉండాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): శోభకృత్ సంవత్సరంలో పంటలు సమృద్ధిగా పండి, వ్యాపారాలు లాభాలు రావాలని జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని మార్కండేయ ఆలయంలో పంచాంగ శ్రవణానికి హాజరయ్యారు. జెడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శాలివాహన
చక్రవర్తి జయంతి
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల పట్టణం కుమ్మర్లశాఖ ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతిని బుధవారం నిర్వహించారు. శాలివాహన చక్రవర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి, జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు నెల్లుట్ల కనకయ్య మాట్లాడుతూ దేశాన్ని పాలించిన తొలి చక్రవర్తిగా, నవీన శకానికి నాంది పలికిన గొప్ప వీరుడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వైస్‌ప్రెసిడెంట్ ఎలగందుల వెంకన్న, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, అన్నారపు శ్రీనివాస్, నెల్లుట్ల యాదగిరి, అన్నారపు రవీందర్, కనుక్య, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న రుద్రమణి

స్వప్నను అభినందిస్తున్న చైర్‌పర్సన్ జిందం కళ

