
వేములవాడ/సిరిసిల్లటౌన్/సిరిసిల్లకల్చరల్: ఉగాది వేడుకలు వేములవాడ రాజన్న సన్నిధిలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పచ్చడి, బూరెలను స్వామికి నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం 4.15 గంట లకు మేళతాళాల మధ్య పంచాంగాన్ని ఆలయ ఓపెన్‌స్లాబ్‌లోని వేదిక వద్దకు తీసుకొచ్చారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో ఉపప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్‌శర్మ, అర్చక బృందం పంచాంగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఏడాదిపాటు జరిగే కార్యక్రమాలను ఆలయ ఉప ప్రధానార్చకులు చంద్రగిరి శరత్‌శర్మ వివరించారు. పంచాంగ శ్రవణం చేసిన అర్చకులను ఏఈవో శ్రీనివాస్ సన్మానించారు. సిరిసిల్లలోని మార్కండేయ ఆలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణానికి జిల్లా ఎస్పీ అఖిల్‌మహాజన్ హాజరయ్యారు.

వేములవాడలో పంచాంగ శ్రవణానికి హాజరైన పురప్రముఖులు
