ఏపీటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గం ఎంపిక
ఒంగోలు సిటీ: స్థానిక సంతపేటలోని ఆచార్య రంగా భవన్‌లో ఆదివారం ఏపీటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు టి.సుబ్బారాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా శాఖ నూతన అధ్యక్షునిగా షేక్ నాయబ్ రసూల్, ప్రధాన కార్యదర్శిగా బి.శేషారావు, ఉపాధ్యక్షులుగా టి.సుబ్బారాయుడు, పి.హనుమంతరావు, ఏవీ ప్రసాద్, కే తిరుమల, పి.రమేష్‌బాబు, కార్యదర్శులుగా జె.ఆనందరావు, కె.మల్లికార్జునరావు, సీహెచ్ శివరామకృష్ణ, పి.శేఖర్‌రెడ్డి, జి.రామకృష్ణ, షేక్ బషీరున్నీసాను ఎన్నుకున్నారు. రాష్ట్ర కౌన్సిలర్లు డి.శ్రీనివాసులు, కే శ్రీనివాసరావు, ఎస్.నారాయణరెడ్డి, వి.అనూరాధ, పి.రాజ్‌కుమార్, ఏ శ్రీనివాసరావు, టి.శ్రీనివాసులు, ఎన్.గోపాల్‌రెడ్డి, బి.రామానాయుడు, ఎంఎల్ మంజులను ఎన్నుకున్నారు.
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి...
ఏపీటీఎఫ్ జిల్లా నూతన కార్యవర్గ ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ మంజుల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే భానుమూర్తి, పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు, ఎన్నికల అధికారిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎం.అనిత, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర అధ్యక్షుడు ఏ శ్యాంసుందర్‌రెడ్డి, పూర్వ రాష్ట్ర కార్యదర్శులు ఐ.విజయ సారధి, బీ రఘుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టంలో నియమితులైన ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కోసం విద్యాహక్కు చట్టాన్ని సవరణ చేయాలని కోరారు. తొమ్మిది రకాల పాఠశాలలను రద్దుచేసి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ప్లస్ 2 పాఠశాలలను కొనసాగించాలన్నారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. వందరోజుల కార్యాచరణపై పునఃసమీక్షించాలని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ప్రకటించి 11వ పీఆర్సీ, డీఏ బకాయిలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని తీర్మానం చేశారు.
ఒంగోలు సిటీ: తిరుపతిలోని సంస్కతం యూనివర్సిటీలో ఈ నెల 27వ తేదీ నిర్వహించిన రాష్ట్రస్థాయి కౌశల్ పోటీల్లో జిల్లా విద్యార్థులు రెండు బహుమతులు సాధించారు. క్విజ్ పోటీల్లో రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ అఫ్రీన్, సంతనూతలపాడు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని లక్ష్మీసాయి ప్రియాంక, మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి టి.వెంకట హరికిరణ్ రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానం సాధించి కన్సొలేషన్ బహుమతి అందుకున్నారు. గొట్లగట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కే కావ్య పోస్టర్ ప్రజెంటేషన్లో ద్వితీయ బహుమతి సాధించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా వీరు బహుమతులు అందుకున్నారు. విజయం సాధించిన విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక, ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి ఏ చంద్రమౌలేశ్వర్, మార్కాపురం విద్యాశాఖ అధికారి ఎం.శ్రీనివాసులు అభినందించారు.


