విద్యార్థులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు
మార్కాపురం: విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేజీబీవీ అడిషనల్ ప్రాజెక్టు ఆఫీసర్ అనీల్‌కుమార్ హెచ్చరించారు. తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు కేజీబీవీలో అక్కడి సిబ్బంది విద్యార్థినులతో పాఠశాల క్లీనింగ్, చపాతీలు చేయించడంపై ఆదివారం పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు కేజీబీవీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి విషయాలు అడిగి తెలుసుకున్నారు. స్కూల్ నిర్వహణ, విద్యార్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విచారణ అనంతరం నివేదికను కలెక్టర్‌కు అందచేయనున్నట్లు తెలిపారు. ఈయన వెంట ఎంఈఓ సుబ్బారావు, వన్‌ఇన్టిస్టిట్యూట్ వన్ ఆఫీసరు ఇన్‌చార్జి జ్యోత్న్సకుమారి, జీసీడీఓ హేమలత పాల్గొన్నారు.


