గంజాయి కేసులో నిందితుడు అరెస్టు
ఒంగోలు టౌన్: బొకారో ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం రాత్రి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 11.800 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఈ కేసులో 37 గంజాయి చాక్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. తమిళనాడులోని నాగపట్టిణం జిల్లాకు చెందిన ఆషీక్ కాలేజీ బ్యాగులో గంజాయిని తరలిస్తున్నట్లు నిర్ధారించారు. విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం నుంచి గంజాయి తీసుకువచ్చి తమిళనాడులో విక్రయిస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. తనిఖీల్లో మహిళా పోలీసుస్టేషన్ సీఐ సుధాకర్, ఎస్సైలు శివరామయ్య, సుదర్శన్, జీఆర్‌పీ ఎస్సై మధుసూదన్‌రావు, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.


