జిల్లా సిమెంట్ అండ్ ఐరన్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
ఒంగోలు సిటీ: జిల్లా సిమెంట్ అండ్ ఐరన్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక గుంటూరు రోడ్డులోని గోల్డెన్ వెన్యూ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. నూతన కమిటీ జిల్లా అధ్యక్షునిగా కందుల శ్రీనివాసరావు (ఒంగోలు), ఉపాధ్యక్షునిగా బిజ్జం వెంకట కృష్ణారెడ్డి (అద్దంకి), సెక్రటరీగా కుంచాల శంకర్ (ఒంగోలు), కోశాధికారిగా బొలినేని శ్రీనివాసరావు (ఒంగోలు), సంయుక్త కార్యదర్శి మోరా రవిశంకర్‌రెడ్డి (కనిగిరి)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా గౌరవాధ్యక్షులుగా ఒగ్గిశెట్టి నరసింహం (పర్చూరు), బత్తినేని తిరుపతిస్వామి (ఒంగోలు), బొగ్గవరపు నరసింహారావు (కందుకూరు), బొంతల వెంకట సుబ్రహ్మణ్యం (పామూరు), యక్కల చెంచయ్య (మార్కాపురం), సాయిన అంజయ్య (ఒంగోలు)లను ఎన్నుకున్నారు.
సింగరాయకొండ: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం స్థానిక రైల్వేస్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారం ఉత్తరం వైపు జరిగింది. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహం కుడిచేతిపై శ్రీరామ అని, ఎడమ చేతిపై పి. పట్టపువీరయ్య అని పచ్చబొట్టు ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించామన్నారు.
మృతుని వివరాలు తెలిసిన వారు 9440627647 నంబర్‌ను సంప్రదించాలని ఒంగోలు రైల్వే జీఆర్పీ ఎస్సై పి.మధుసూదనరావు విజ్ఞప్తి చేశారు.
జిల్లా సిమెంట్ అండ్ ఐరన్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక


