రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో విజేత ప్రకాశం
కనిగిరిరూరల్: 58వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు విజేతగా నిలిచినట్లు ఖోఖో సంఘ జిల్లా కార్యదర్శి భవనం కాశిరెడ్డి తెలిపారు. ఈ నెల 24 నుంచి 26 వరకు కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 58వ రాష్ట్రస్థాయి పురుషులు, మహిళల పోటీల్లో ప్రకాశం జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్‌లో కృష్ణా జిల్లాపై 12–16 తేడాతో ప్రకాశం జట్టు విజేతగా నిలిచింది. వరుసగా మూడుసార్లు ప్రకాశం జట్టు విజేత విజేత నిలిచినట్లు పీడీ కాశీ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విజేత జట్టును రాష్ట్ర ఖోఖో సంఘ కార్యదర్శి కె. హనుమంతరావు, జాతీయ ఖోఖో సంఘ ఉపాధ్యక్షుడు మేలక సీతారామిరెడ్డి, మేనేజర్స్ ఈ జ్యోతి, పి. సావిత్రి, వ్యాయామ ఉపాధ్యాయులు అభినందించారు.


