కోడిపందేల శిబిరంపై దాడి
● ఆరుగురు జూదరుల అరెస్టు
ఒంగోలు టౌన్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందేల శిబిరాలపై పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం మండలంలోని చెరుకుంపాలెం గ్రామ శివారులో కోడి పందెం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దాడిలో ఆరుగురు పందెం నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.3520తో పాటు పందెం కోడిని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి సీఐ సుధాకర్, ఎస్సై సుదర్శన్, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదిన మండలంలోని పేర్నమిట్ట శివారులో కోడిపందెం నిర్వహిస్తున్న శిబిరంపై దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. 21న గుండాయపాలెం గ్రామ శివారులో దాడి చేసి ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు.


