ఆహార తయారీ ఉత్పత్తిదారులకు సీడ్ క్యాపిటల్
● డీఆర్‌డీఏ పీడీ నారాయణ
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని ఆహార తయారీ ఉత్పత్తిదారులకు సీడ్ క్యాపిటల్‌గా రూ.40 వేల రుణం అందిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ టి.నారాయణ తెలిపారు. ఒంగోలు భాగ్యనగర్‌లోని వెలుగు టెక్నికల్ అండ్ ట్రైనింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో సీడ్ క్యాపిటల్, పీఎంఎఫ్‌ఎంఈ స్కీంకు సంబంధించి శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ సీడ్ క్యాపిటల్‌కు అర్హులైన వారిని అన్ని మండలాల సిబ్బంది గుర్తించాలన్నారు. వారికి కావాల్సిన రుణాలు ఇప్పించాలన్నారు. అదేవిధంగా ఉదయం రిజిస్ట్రేషన్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, మొదలగు వాటిని పూర్తి చేయాలని, పుస్తక నిర్వహణను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో యూనిట్లు డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నారు. డ్వాక్రా ఉత్పత్తులు, స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పీఎంఈజీపీ ద్వారా యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. తక్కువ లక్ష్యాలు సాధించిన మండల సిబ్బందితో సమీక్షించారు. డీపీఎం, ఎల్‌హెచ్ దానం, ఏపీఎం, ఎల్‌హెచ్ సుబ్బారావు, ట్రైనర్లు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.


