ఎస్టీయూ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
ఒంగోలు సిటీ: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ప్రకాశం జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి పి. రమణారెడ్డి, ఎన్నికల పరిశీలకుడు బి.శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్‌లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 79 వ వార్షిక కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఓ.ఎర్రయ్య అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన జిల్లా అధ్యక్షునిగా చేతల వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గవిని శివశంకర్, ఆర్థిక కార్యదర్శిగా ఓ.కృష్ణ, గౌరవాధ్యక్షునిగా కడియాల ప్రసాదు, మహిళా విభాగం కన్వీనర్‌గా ఎ.శ్రీదేవి, రాష్ట్ర కౌన్సిలర్స్ గా వేమ శేషు, చల్లా శ్రీనివాసులు, పొతకమూరి కృష్ణయ్య, పిగిలి కొండయ్య, ఎ.నాగయ్య ఎన్నికయ్యారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ సీపీఎస్‌ను రద్దు చేయాలని, పీఆర్సీ నియామకం చేపట్టాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఎగ్జామ్ నుంచి మినహాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్.నారాయణ, సహాయ కార్యదర్శి వెంకట్రావు, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు సీహెచ్.ఆదినారాయణ, ఎస్‌టీయూ నాయకులు నరసింహారెడ్డి, మేకల మోహన్‌రావు, గద్దగుంట వెంకటేశ్వర్లు, కాపులూరి వెంకటేశ్వర్లు, వేల్పుల రమేష్, రవికిరణ్ యాదవ్, మాలిరావు, ఎ.రమేష్, మధుసూదన్ రావు, చల్లా అంకరాజు, టి.రమణయ్య, ఒ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


