తప్పిపోయిన బాలికను మేనమామ చెంతకు చేర్చిన పోలీసులు
మార్కాపురం: ఇంటి నుంచి తప్పిపోయి పట్టణంలో తిరుగుతున్న నాలుగేళ్ల బాలికను పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చి మేనమామ చెంతకు చేర్చిన సంఘటన శనివారం జరిగింది. బోడపాడుకు చెందిన ప్రసాద్ కుమార్తె హేమప్రియ పట్టణంలోని కొండేపల్లి రోడ్డులో నివాసముంటున్న మేనమామ ఇంటికి వచ్చింది. శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి మళ్లీ అడ్రస్ తెలీక అలా నడుచుకుంటూ ఆర్టీసీ బస్టాండ్ సమీపానికి వచ్చింది. పోలీసులు గుర్తించి పట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. పాప ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మేనమామ శ్రీరాం నరసింహారావు గుర్తించి పోలీసుల వద్దకు రావడంతో సీఐ సుబ్బారావు పాపను అప్పగించారు. పాపను గుర్తించడంలో కృషి చేసిన హోంగార్డు కాశయ్య, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరావును సీఐ అభినందించారు.


