రేపు స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ | - | Sakshi
Sakshi News home page

రేపు స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌

Dec 7 2025 7:18 AM | Updated on Dec 7 2025 7:18 AM

రేపు స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌

రేపు స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌

ఒంగోలు సిటీ: కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్‌ సెల్‌, అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) జాతీయ స్థాయిలో ఈ నెల 8, 9 తేదీల్లో స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ – 2025 (ఎస్‌ఐహెచ్‌–2025) నిర్వహించనున్నారు. స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌–2025 సాఫ్ట్‌వేర్‌ ఎడిషన్‌ ఫైనల్‌ పోటీలకు ఒంగోలులోని క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఆతిథ్యం ఇవ్వనున్నట్లు క్విస్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ నిడమానూరి సూర్యకల్యాణ్‌ చక్రవర్తి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నిడమానూరి గాయత్రి తెలిపారు. సంబంధిత పోస్టర్‌ను సూర్య కల్యాణ్‌ చక్రవర్తి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌కి క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల మూడోసారి ఆతిథ్యం ఇవ్వనుందని తెలిపారు. గతంలో హార్డ్‌వేర్‌ ఎడిషన్‌, సాఫ్ట్‌వేర్‌ ఎడిషన్‌ నిర్వహించామని, ఈ ఏడాది సాఫ్ట్‌వేర్‌ ఎడిషన్‌కి ఆతిథ్యం ఇస్తున్నామని అన్నారు. క్విస్‌ కళాశాలకు మూడోసారి అవకాశం ఇచ్చినందుకు ఐఏసీటీఈ, విద్యామంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్‌ సెల్‌కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో కేవలం మూడు కాలేజీలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, దానిలో తమ కళాశాల ఒకటి అని అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 20 టీమ్‌లు పాల్గొని నాలుగు ప్రాబ్లమ్‌ స్టేట్మెంట్లకు పరిష్కారాలు కనుక్కుంటాయన్నారు. క్విస్‌ కాలేజీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని మరో 60 విద్యాలయాలు, ఐఐటీల్లో జరిగే ఈ స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌లో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా పాల్గొని విద్యార్థులతో మాట్లాడతారని చెప్పారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై.వి.హనుమంతరావు, ఎస్‌ఐహెచ్‌ 2025 క్విస్‌ నోడల్‌ సెంటర్‌ కన్వీనర్‌ డాక్టర్‌ డి.బుజ్జిబాబు, కో – కన్వీనర్‌ డాక్టర్‌ భార్గవ్‌, వివిధ విభాగాల హెచ్‌వోడీలు, డీన్‌లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.

8160 మంది పోటీదారులు

స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 2025 కోసం దేశవ్యాప్తంగా 1,42,715 టీమ్‌లు తమ ఐడియాలతో ముందుకు వచ్చాయి. వారిలో 1360 టీమ్‌లను ఫైనల్స్‌కు ఎంపిక చేశారు. మొత్తం 60 నోడల్‌ సెంటర్లలో దాదాపు 8160 మంది పోటీపడనున్నట్లు ఏఐసీటీఈ ప్రకటించింది. ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ లక్ష్యంగా వివిధ రాష్ట్రాల విద్యార్థులను వేర్వేరు రాష్ట్రాల్లోని నోడల్‌ సెంటర్లకు పంపేలా చర్యలు తీసుకున్నారు. ఒక జట్టుగా ప్రాబ్లమ్‌ స్టేట్‌మెంట్లపై పరిష్కారం చూపనున్నారు.

ఒంగోలు క్విస్‌ కళాశాలలో నిర్వహణ

వర్చువల్‌గా పాల్గొననున్న ప్రధాని నరేంద్రమోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement