హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత

Dec 7 2025 7:18 AM | Updated on Dec 7 2025 7:18 AM

హోంగా

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత

హోంగార్డు రైజింగ్‌ డేలో

ఎస్పీ హర్షవర్థన్‌రాజు

ఒంగోలు టౌన్‌:

పోలీసు శాఖలో ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న హోంగార్డుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ హర్షవర్థన్‌రాజు తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కవాతులో ఎస్పీ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో హోంగార్డులు అంతర్భాగమని అన్నారు. పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణ, బందోబస్తు, నేర నియంత్రణ, టెక్నికల్‌ విభాగాలతో పాటు ట్రాఫిక్‌ నియంత్రణ, డయల్‌ 112, మహిళా పోలీసు స్టేషన్‌లో విధులు, విపత్తుల నిర్వహణలో అహర్నిశలు విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. మోంథా తుఫాన్‌ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా, ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా హోంగార్డులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. పోలీసు శాఖలోని హోంగార్డులు పలు రకాల విధులను చాకచక్యంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

హోంగార్డుల సంక్షేమం కోసం

అనేక పథకాలు...

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో హోంగార్డుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కో ఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటు చేయడం ద్వారా అవసరమైన వారికి లక్ష రూపాయల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అత్యవసర సమయాలలో 5 వేల రూపాయల సాయం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. డిజిటల్‌ గుర్తింపు కార్డు, సబ్సిడీతో సరుకులు కొనుగోలు చేసేందుకు పోలీసు క్యాంటీన్‌ కార్డు, మహిళా హోంగార్డులకు మూడు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, నెలకు రెండు రోజుల జీతంతో కూడిన సెలవులు, హోంగార్డుల కూతుళ్ల పెళ్లికి, మెడికల్‌ సహాయార్థం 5 వేల రూపాయల సాయం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన హోంగార్డులకు రూ.5 లక్షలను ప్రభుత్వం ఆర్థిక సహాయంగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. హోంగార్డుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ డే నిర్వహించి వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరణించిన హోంగార్డుల

కుటుంబాలకు చెక్కుల పంపిణీ

జిల్లా పోలీసు శాఖలో ఉత్తమ సేవలందిస్తూ విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు మారుతి కుమార్‌రెడ్డి సతీమణి తేజస్వినికి హోంగార్డుల ఒక రోజు వేతనం నుంచి సేకరించిన రూ.4,78,540 చెక్కును ఎస్పీ అందజేశారు. ఉద్యోగ విరమణ చేసిన జానకి రామయ్యకు హోంగార్డుల ఒకరోజు వేతనంతో సేకరించిన రూ.4,80,670 చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. మోంథా తుఫాన్‌ సమయంలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన హోంగార్డులకు ప్రశంసపత్రాలు అందజేశారు.

విజేతలకు బహుమతులు...

హోంగార్డులకు నిర్వహించిన స్పోర్ట్స్‌ మీట్‌లో విజేతలకు ఎస్పీ హర్షవర్థన్‌రాజు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వ్యక్తిగత, జుట్టు విభాగాలలో షాట్‌పుట్‌, లాంగ్‌ జంప్‌, 100 మీటర్లు, వాలీబాల్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌ క్రీడలు నిర్వహించారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. అనంతరం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు హోంగార్డులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివసరావు, మహిళా పోలీసు స్టేషన్‌ డీఎస్పీ రమణ కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు నాగరాజు, వెంకటేశ్వర్లు, మేడా శ్రీనివాసరావు, శ్రీకాంత్‌, సుధాకర్‌, పాండురంగారావు, ఆర్‌ఐలు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత 1
1/2

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత 2
2/2

హోంగార్డుల సంక్షేమానికి ప్రాధాన్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement