
ఆగస్టు 17, 18 తేదీల్లో రాష్ట్ర మహాసభలు
కన్నీళ్లు దాటుకుని..!
పీ–4కు 74 వేల కుటుంబాల గుర్తింపు
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్:
పీ–4 పథకంలో జిల్లావ్యాప్తంగా 74 వేల కుటుంబాలను గుర్తించినట్లు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. రహదారులు–భవనాలు, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో పనులు చేపట్టే కాంట్రాక్టర్లతో గురువారం స్థానిక ప్రకాశం భవనంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరికం లేని సమాజాన్ని రూపొందించటంలో కాంట్రాక్టర్లు కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం పీ–4 పథకంలో మార్గదర్శకులుగా నిలవాలని కోరారు. పీ–4 పథకం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జెడ్పీ సీఈవో చిరంజీవి వివరించారు. సమావేశంలో సీపీవో స్వరూపారాణి, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి రవికుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు, ఇరిగేషన్ ఎస్‌ఈ వరలక్ష్మి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రవినాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు...
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై గురువారం ఉదయం ఒంగోలులోని కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు సజావుగా నిర్వహించి మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మధుసూదనరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు, ఇరిగేషన్ ఎస్‌ఈ వరలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి కిరణ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ నారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, బీసీ వెల్ఫేర్ అధికారి నిర్మలజ్యోతి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి వరలక్ష్మి, డీడీ మైన్స్ రాజశేఖర్, జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు పాల్గొన్నారు.
కంభం మండలంలోని రావిపాడులో ఆఖరి మజిలీకి కూడా అవస్థలు తప్పడం లేదు. గ్రామంలో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు శ్మశానానికి గుండ్లకమ్మ వాగు దాటి వెళ్లాలి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో వాగులో ఉధృతంగా నీరు ప్రవహిస్తుంటుంది. అలాంటి సమయంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబీకుల బాధలు వర్ణణాతీతం. ఇటీవల వర్షాలు కురవడంతో వాగులో మోకాలి లోతు నీరు ప్రవహిస్తోంది. గురువారం గ్రామంలో ఎల్లమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో ఆమె బంధువులు, కుటుంబ సభ్యులు వాగులో నుంచే అష్టకష్టాలు పడుతూ మృతదేహాన్ని మోసుకెళ్లారు. కొందరు వాగు దాటలేక అవతలి ఒడ్డునే ఉండిపోయారు. ఇక్కడ వంతెన నిర్మించాలని ఎన్నో పర్యాయాలు
అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
– కంభం

ఆగస్టు 17, 18 తేదీల్లో రాష్ట్ర మహాసభలు