ఒంగోలు సిటీ: వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సేవా సంస్థ ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ రికార్డు సాధనే లక్ష్యంగా ఒంగోలులో 3,600 అడుగుల పొడవైన జాతీయ జెండాతో బుధవారం ప్రదర్శన నిర్వహించారు. క్లబ్ ప్రెసిడెంట్ ఎ.రామకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ శిద్దా వెంకట సూర్యప్రకాష్‌రావు, ఇతర సభ్యుల ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాక ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ ఏఆర్ దామోదర్‌తో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ గ్రౌండ్ నుంచి అద్దంకి బస్టాండ్ వరకు భారీ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్.దామోదర్ మాట్లాడుతూ జాతీయ జెండాను తెలుగు వారైన పింగళి వెంకయ్య రూపొందించడం గర్వకారణమన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మహోన్నత వ్యక్తికి ఇలాంటి గొప్ప ఘనత దక్కిందని, త్రివర్ణ పతాకాన్ని చూస్తేనే.. మనలో సహజంగానే దేశభక్తి, గర్వం ఉరకలేస్తాయన్నారు. శాంతి, సహనం, అహింస అనే తత్వాన్ని మన జాతీయ జెండా చాటి చెబుతుందన్నారు. జాతీయ భావనను, సమైక్యతను పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషదాయకామని తెలిపారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతున్నారని, వాటి వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు, డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్ సీఐ నాగరాజు, టూటౌన్ సీఐ యం.శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో 3,600 అడుగుల త్రివర్ణ పతాకంతో దేశభక్తి ర్యాలీ వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ప్రదర్శన
రికార్డు పతాక
రికార్డు పతాక