
జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం
ఒంగోలు సిటీ:
స్థానిక జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం బుధవారం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి పాల్గొన్న ఈ సమావేశాల్లో కనిగిరి ఎమ్మెల్యేతో పాటు, జెడ్పీటీసీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మూడు జిల్లాల అధికారులు హాజరయ్యారు. 2వ స్థాయీ సంఘమైన గ్రామీణాభివృద్ధిలో భాగంగా డీఆర్‌డీఏ–హౌసింగ్ శాఖలకు సంబంధించి గత సమావేశాల్లో సభ్యులు అడిగిన అంశాలపై తీసుకున్న చర్యలు, అలాగే ప్రస్తుతం పురోగతిలో ఉన్న పథకాలపై సమీక్షించారు. వివిధ స్థాయీ సంఘాలైన వ్యవసాయ సంబంధిత అంశాలు, విద్య, వైద్యం, సీ్త్ర, శిశు సంక్షేమ కమిటీ, సాంఘిక సంక్షేమ కమిటీలపై సమీక్షించారు. ప్రతిపాదించిన పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు.