
ఊరూరా ఎల్లో బెల్ట్
జిల్లాలో లైసెన్స్‌డ్ మద్యం దుకాణాలు
171
గీత కార్మికులకు కేటాయించినవి
సోమవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2025
– 8లో..
ఎల్లో ‘బెల్ట్’..పచ్చని పల్లెలకు ఉరితాడుగా మారుతోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో మద్యం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్న పచ్చపార్టీ నేతలు లైసెన్సు షాపులకు అదనంగా పది నుంచి 15 బెల్టుషాపులు పెట్టి యథేచ్ఛగా మద్యం విక్రయాలు
సాగిస్తున్నారు. బెల్టు షాపుల వద్దే సిట్టింగ్‌లు ఏర్పాటు చేసి పగలు, రాత్రి తేడా లేకుండా మందుపోస్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా ఆటోల్లో, బైక్ మీద వీధివీధినా తిరుగుతూ మద్యం అమ్ముతున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న ఎకై ్సజ్ అధికారులు వాటివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మొక్కుబడి దాడులు..
నామమాత్రపు హెచ్చరికలతో సరిపెడుతున్నారు.
దీంతో బెల్టుషాపుల దందాకు అంతులేకుండా పోతోంది.

ఊరూరా ఎల్లో బెల్ట్