
రైతులకు రైతు ఉత్పత్తిదారుల సంస్థ అండగా ఉండాలి
ఒంగోలు వన్‌టౌన్: రైతులకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జీవనోపాధులు పెంపొందించడంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ అండగా ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డైరక్టర్ టీ నారాయణ సూచించారు. ఒంగోలు భాగ్యనగర్‌లోని టీటీడీసీలో జిల్లాలోని 12 మండలాల ఎఫ్‌పీఓ–కమ్యూనిటీ కోఆర్డినేటర్స్, ఫార్మర్ మిత్రాలు, ఎఫ్‌పీఓ అకౌంటెంట్లతో శుక్రవారం పీడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలు, మునగ సాగు, వెదురు సాగు, తేనెటీగల పెంపకం, కొర్రమీను చేప పెంపకం తదితర సబ్ సెక్టార్లకు 50 శాతం సబ్సిడీని చిన్న, సన్న కారు రైతులకు అందజేయాలని పీడీ తెలిపారు. షేడ్ నెట్ కల్టివేషన్, సోలార్ డ్రైయర్ ఉపయోగాలను వివరించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జోసెఫ్, ఉద్యాన వన శాఖ అధికారి డీ సంధ్యారాణి, డీ ఝాన్సీరాణి, జేపీఈ ఏపీసీఎన్‌ఎఫ్ లక్ష్మీరెడ్డి, అడిషనల్ పీడీ డి.దానం, జీవనోపాధుల డీపీఎం జే నారాయణ, లైవ్‌లీ హుడ్ యూనిట్ జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.