కొందరికే వంధనం | - | Sakshi
Sakshi News home page

కొందరికే వంధనం

Jun 15 2025 9:13 AM | Updated on Jun 15 2025 9:13 AM

కొందర

కొందరికే వంధనం

గ్రామాల్లో భయం..భయం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు సిటీ: ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చాక ఈ పథకం అమలు విషయంలో తాత్సారం చేస్తూ వచ్చింది. వీలైనంత మంది విద్యార్థుల సంఖ్యకు కొత పెట్టేందుకు రకరకాల నిబంధనలు తెచ్చింది. అంతేకాదు రూ.15 వేలు జమచేస్తామంటూ చెప్పి రూ.13 వేలు మాత్రమే వారి అకౌంట్లుల్లో జమచేస్తామని చెప్పడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశ చెందారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు కారణంగా పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడనున్నాయి.

జిల్లాలో 1.9 లక్షల మందికి కోత..

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 2,991 ఉన్నాయి. వీటిల్లో 3,32,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు 42,439 మంది ఉన్నారు. మొత్తంగా సుమారు 3,74,939 మంది విద్యార్థులు విద్యనభ్యశిస్తున్నారు. అయితే ప్రభుత్వం పలు రకాల నిబంధనలు అమలు చేసి 2,65,559 మంది విద్యార్థులను మాత్రమే అర్హులుగా చేర్చింది. 1,68,603 మంది తల్లుల ఖాతాలో రూ.215.23 కోట్లు (రూ.13 వేలు చొప్పున) జమ కానుందని ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం తెలుస్తోంది. మిగతా వారికి సుమారు 1,09,380 మంది విద్యార్థులను అనర్హులుగా చేర్చింది. దీంతో అనర్హులుగా ఉన్న సామాన్య, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

సచివాలయాల్లో జాబితాలు చూసి..

జిల్లాలోని 719 గ్రామ, వార్డు సచివాలయాల్లో తల్లికి వందనం జాబితాలను ప్రదర్శనకు ఉంచారు. 597 గ్రామ, 122 వార్డు సచివాలయాల్లో ఉంచిన జాబితాలను చూసి చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. పలు నిబంధనలు పేరుతో అనర్హుల జాబితాల్లో తమ పేర్లు ఉండడంతో వారు నిర్ఘాంత పోతున్నారు. ప్రభుత్వ లెక్క ప్రకారం చూస్తే ఇటీవల టెన్త్‌ పరీక్షలు రాసి ఇంటర్లో చేరిన విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరనుంది. పాలిటెక్నిక్‌, ఐటీఐ చదివిన వారు, కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిన వారిని అనర్హులుగా ప్రకటించారు. అలాగే తల్లి ఇంటి పేరు మారినా, ఇంట్లో ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉన్నా.. పది ఎకరాలకు మించి పొలాలు ఉన్నా.. కొందరికి అసలు పొలాలు లేకపోయినా పొలాలు ఉన్నట్టు చూపించి అనర్హులుగా చేర్చారు. 75 కంటే తక్కువ హాజరు శాతం ఉన్నా ఈ పథకాన్ని వర్తింపజేయలేదని తెలిసింది.

డ్రౌపౌట్స్‌ పేరుతో 35 వేల మందికి మంగళం

ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో సుమారు రూ.45,807 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావడం లేదని జిల్లా విద్యాశాఖ అధికారులు తేల్చారు. అందులో 12,202 మంది తిరిగి పాఠశాలకు వచ్చినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో 33,605 మంది విద్యార్థులు పాఠశాలలకు రావడలేదని చెబుతూ వారిని ఈ పథకానికి అనర్హులుగా తేల్చారు.

తల్లికి వందనానికి కొర్రీలు జిల్లాలో లక్ష మందికి మొండిచెయ్యి మొత్తం 3,74,939 మంది విద్యార్థులు 2,65,559 మందికే లబ్ధి 1,09,380 మందికి ఎగనామం డ్రౌపౌట్స్‌ పేరుతో 35 వేల మందికి మంగళం సచివాలయాల్లో జాబితాలు చూసి అవాక్కు

బాబును నమ్మితే భవిష్యత్తు గాలికే

చంద్రబాబు మాటలు నమ్మితే పిల్లల భవిష్యత్తు గాలిలో కలిసిపోయినట్లే. మాది చిన్న రైతు కుటుంబం. ఒక కుమారుడు ఉన్నాడు. ఈ ఏడాది పదో తరగతి చదువుతున్నాడు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం వచ్చింది. కానీ గత ఏడాది ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు. ఇప్పుడు కూడా తల్లికి వందనం డబ్బులు పడలేదు. అయినా మా బాబును కూలినాలి చేసి చదివించుకుంటాం. చంద్రబాబును నమ్మి మా అబ్బాయి జీవితం పాడుచేసుకోలేం.

– ఎగ్గోని లక్ష్మి, చందవరం, దొనకొండ మండలం

నమ్మించి మోసగించారు

నాకు ఇద్దరు పిల్లలు. కుందురు హారిక రెడ్డి 8వ తరగతి, కుందురు చందనాథరెడ్డి 7వ తరగతి చదువుతున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ, చిన్నపాటి బడ్డీ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. గతంలో అమ్మ ఒడి వచ్చింది. కానీ ఈసారి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి తల్లికి వందనం ఆపేశారు. పిల్లలు బాగా చదువుతున్నారు. తల్లికి వందనం పథకం ఇస్తామని చెప్పి మా ఆశలపై నీళ్లు చల్లారు. నమ్మించి మోసగించారు. అప్పులు చేసి చదివించలేము, అమ్మటానికి ఆస్తులు లేవు. ప్రభుత్వం ఎలాగైనా సహకరించాలి.

– కుందురు నాగదుర్గ, కురిచేడు

కొందరికే వంధనం1
1/3

కొందరికే వంధనం

కొందరికే వంధనం2
2/3

కొందరికే వంధనం

కొందరికే వంధనం3
3/3

కొందరికే వంధనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement