న్యాయపోరాటానికి సిద్ధం...
అగ్రిమెంట్ కాలం ఉండగానే మమ్మల్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయం. మా వాహనాలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఎన్‌ఓసీ ఇప్పించాలి. న్యాయం చేయకుండా జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం సరఫరా చేస్తే న్యాయపోరాటానికి సిద్ధం.
– కొప్పుల అరవింద్, జిల్లా ప్రెసిడెంట్,
ఎండీయూ ఆపరేటర్ల సంఘం
ఉపాధి కోల్పోయా
వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషించుకునే వాడిని. గత ఐదేళ్లుగా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాను. ఒక్కసారిగా తొలగించడం అన్యాయం. ఉపాధి కోల్పోయిన ఆపరేటర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలి. – అనిల్, ఎండీయూ
ఆపరేటర్, కంభం మండల
న్యాయపోరాటానికి సిద్ధం...


