పోలీసు గ్రీవెన్స్‌కు 92 ఫిర్యాదులు
ఒంగోలు టౌన్: ప్రజల సమస్యలను పరిష్కరించడమే ‘మీ కోసం’ లక్ష్యమని ఎస్పీ ఏఆర్ దామోదర్ చెప్పారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి 92 మంది ఫిర్యాదుదారులు ఎస్పీని కలిసి సమస్యలపై అర్జీలు అందజేశారు. చట్టప్రకారం విచారణ చేపట్టి బాధితులకు న్యాయం అందించేలా చూడాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె. నాగేశ్వరరావు, వన్‌టౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, సీసీఎస్ సీఐ జగదీష్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సైలు షేక్ రజియా సుల్తానా, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


