
మాట్లాడుతున్న తాటిపర్తి చంద్రశేఖర్
పెద్దారవీడు: పేదరిక నిర్మూలనకు ఆహర్నిశలూ కృషి చేస్తూ సంక్షేమ పథకాలతో ఆర్థిక సమానత్వాన్ని తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచారని వై.పాలెం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త తాటిపార్తి చంద్రశేఖర్ కొనియాడారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం అవరణలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి చంద్రశేఖర్‌తో పాటు మహిళలు క్షీరాభిషేకం చేశారు. మండల పరిధిలో 551 గ్రూపులకు 5557 మంది లబ్ధిదారులకు రూ.3,18,23,227 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చట్లమిట్ల గ్రామానికి చెందిన గంజి సుబ్బారెడ్డికి రూ.2 లక్షలు చెక్కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. మహిళలకు రుణమాఫీ నుం విముక్తి కలిగించిన జగనన్నను ఆదరించాలని కోరారు. గతంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేశారని, ఆయన మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి, ప్రజా సంక్షేమమే జగనన్న ధ్యేయమని, దాని కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా తదితర నవరత్నాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. మోసం చేయడం చంద్రబాబు నైజం అయితే చెప్పిన మాటకు కట్టుబడి శిత్తశుద్ధితో హామీలు అమలు చేయడం జగనన్న నైజమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు ప్రకాశిస్తున్నాయని చెప్పారు. టన్నెల్ సొరంగ తవ్వకంలో టీడీపీ నాయకులు, దళారులు, పెత్తందారులు దోపిడీ చేయడంతో పాటు దోచుకుని ఏటీఎం లాగా చేశారని ఎద్దేవా చేశారు. మన ప్రాంతానికి కావాల్సినది వెలిగొండ ప్రాజెక్టు వరం లాంటిదని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని భరోసా ఇచ్చారు. మూడు జిల్లాల్లో వ్యవసాయానికి 4.50 లక్షల ఎకరాలు సాగు నీరు, 15.30 లక్షల మందికి తాగునీరు అందించే ప్రాజెక్టు అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఈ ప్రాంతానికి సాగు, తాగునీటి కష్టాలు ఉండేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను గుర్తించి ఎంత మేరకు ట్యాంకర్లు లేక అవసరమైతే బోర్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. నాడు–నేడు పథకం ద్వారా విద్య వ్యవస్థ సమూలమైన మార్పు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రంలో 10 ఫిషింగ్ హార్బర్లు, 5 షిప్ యార్డులు, 17 మెడికల్ కళాశాలలు నిర్మాణం చేపట్టిన ఘనత సీఎం జగనన్నకే దక్కిందన్నారు. చంద్రబాబు స్కిల్ డెవల్‌మెంటలో రూ.371 కోట్లు తిని అడ్డంగా సీబీఐ అధికారులకు దొరికి పోయారని ఇన్‌చార్జి తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, ఏపీ ఇరిగేషన్ డైరెక్టర్, మాజీ ఎంపీపీ దుగ్గెంపుడి వెంకటరెడ్డి, జెడ్పీటీసీ ఏర్వ చలమారెడ్డి, ఎంపీపీ బెజవాడ పెద్ద గురవయ్య, ఎంపీడీఓ రాజ్‌కుమార్, తహసీల్దార్ దాస్, వెలుగు ఏరియా కో అర్డినేటర్ కుందురు లక్ష్మీరెడ్డి, ఏపీఎం శ్రీనివాసులు, మండల సచివాలయ కన్వీనర్ ఏర్వ వెంకటేశ్వరరెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షుడు తోకల ఆవులయ్య, పార్టీ జిల్లా సెక్రటరీ మురళీధర్‌రెడ్డి, సర్పంచులు బెజవాడ అదాం, అంగిరేకుల ఆదినారాయణ, పాలగిరి రామాంజనేయరెడ్డి, ఎంపీటీసీలు దుదెకుల పకీరయ్య, నాయకులు మూల సత్యంరెడ్డి, వెన్నా శివకృష్ణారెడ్డి, ఎం. రాజారావు, గుండారెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పొతిరెడ్డి నారపరెడ్డి, పంది గురవయ్య, వెన్నా పెద్దపోలిరెడ్డి, పోటు గంగయ్య, అల్లు వెంకటేశ్వరరెడ్డి, కాసు వెంకటరెడ్డి, బత్తుల సాలయ్య, గొట్టం వెణుగోపాలరెడ్డి, నరాల రామచంద్రుడు, సొంటి నాగార్జునరెడ్డి, షేక్ బుజ్జి, వజ్రాల ఆదిరెడ్డి, ఒద్దుల లక్ష్మీరెడ్డి, గాలి రమణారెడ్డి, దుద్దెల వెంకటరెడ్డి, పిల్లి రంగారెడ్డి, బలుసుపాటి నాగరాజు, ఎంపీటీసీలు, పొదుపు సభ్యులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం
సమన్వయకర్త తాటిపర్తి చంద్రశేఖర్

సమావేశానికి భారీగా హాజరైన మహిళలు