
నైట్రేట్ : మిథనో హిమోగ్లోబియా ‘నీలిబేబి’ అనే వ్యాధి శిశువులకు సోకుతుంది.
సీసం : పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. రక్తహీనతకు కారణమవుతుంది. మూత్రపిండాలను దెబ్బతీస్తుంది.
పురుగు మందులు : నాడీ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థకు నష్టాన్ని కలిగిస్తాయి. రోగ నిరోధక శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
కాల్షియం : మలబద్దకం, మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతాయి.
ఫ్లోరైడ్ : ఎముకలు, దంతాలకు ఫ్లోరోసిస్
సోడియం : ఎక్కువ నష్టం కలిగిస్తుంది
మెగ్నీషియం కలిపిన సల్ఫేట్ : అతిసారం వస్తుంది
కేడియం : ఎముకలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది.
ఆర్సెనిక్ : చర్మవ్యాధులు, క్యాన్సర్‌కు కారణమవుతుంది
ఫ్లోరైడ్, ఫ్లోరోసిస్ : ఎముకల్లో వైకల్యాలు, కీళ్లలో సమస్యలు కలిగిస్తుంది.
1788 ఆవాస ప్రాంతాలకు
సురక్షిత నీరు
జిల్లాలోని 1788 ఆవాస ప్రాంతాలకు సురక్షితమైన నీరు అందిస్తున్నాం. దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 65 ఆవాసాలకు 711 ట్రిప్పులతో 135 ట్యాంకర్లు తోలుతున్నాం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మంచినీరు అందించేందుకు నీటి పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. నీటి పరీక్షల్లో రసాయనాలు గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– షేక్ మారధాన్ ఆలీ, ఎస్‌ఈ,
ఆర్‌డబ్ల్యూఎస్, ఒంగోలు