వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో వారం రోజులుగా భక్తుల పూజలందుకున్న గణనాథుడి ప్రతిమలను ఆదివారం నిమజ్జనానికి తరలించారు. దీంతో జిల్లాలోని తీరప్రాంత గ్రామాలైన కొత్తపట్నం, మడనూరు, ఈతముక్కల, పాకల తీరాలకు భారీగా వినాయక ప్రతిమలను సముద్రంలో నిమజ్జనం చేసేందుకు తరలించారు. మేళతాళాలతో, రంగులు చల్లుకుంటూ, బాణసంచా సందడితో కోలాహలంగా విగ్రహాలను తీసుకెళ్లారు. సెలవుదినం కావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కొత్తపట్నం, పాకల సముద్ర తీరాలు సందడిగా మారాయి. ఆదివారం ఒక్కరోజు ఈతముక్కల, మడనూరు, కొత్తపట్నం తీరాల్లో 323 విగ్రహాలను, పాకలలో 176 విగ్రహాలను నిమజ్జనం చేశారు.
– సాక్షి నెట్‌వర్క్