
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్‌కుమార్
ఒంగోలు అర్బన్: ఎవెన్యూ ప్లాంటేషన్ విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించాలని మండల స్థాయి అధికారులకు కలెక్టర్ దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అనుమతులు వారంలో తీసుకోవాలని చెప్పారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి మండల స్థాయి అధికారులతో వివిధ అంశాలపై వీడియో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా 175.2 కి.మీ పొడవున ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆ రోజున లక్షన్నర మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన రూఫ్ టాప్ హార్వస్టింగ్ పనులను త్వరగా చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకంలో నిర్దేశించిన లక్ష్యాలను కచ్చితంగా సాధించాలన్నారు. జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా ఇంటింటికీ కుళాయి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను పూర్తి చేసి సంబంధిత శాఖలకు అప్పగించాలని ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేను సమగ్రంగా నిర్వహించాలన్నారు. కేస్ షీట్స్ రూపొందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాడు–నేడు, జగనన్న కాలనీల్లో నిర్మాణాలు వేగంగా పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ రాజ్యలక్ష్మి, జిల్లా మలేరియా నివారణ అధికారి జ్ఞానశ్రీ, డీఆర్‌డీఏ పీడీ రవికుమార్, హౌసింగ్ పీడీ పేరయ్య, డ్వామా పీడీ శీనారెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఈఓ సుబ్బారావు, జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో ఎవెన్యూ ప్లాంటేషన్ లక్ష్యం
172.5 కిలోమీటర్లు
రూఫ్ టాప్ హార్వెస్టింగ్ పనులను
వేగంగా చేపట్టాలి
మండల స్థాయి అధికారుల సమీక్షలో
కలెక్టర్ దినేష్‌కుమార్