వీడియో సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు
● రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలిపిన కలెక్టర్ దినేష్‌కుమార్
ఒంగోలు అర్బన్: పోలింగ్ కేంద్రాలకు సంబందించి రేషనలైజేషన్ ప్రక్రియ ఈ నెల 22 నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా జిల్లా కలెక్టర్‌లతో వీడియో సమావేశం నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. దీనిలో జిల్లాకు సంబంధించి కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల అధికారికి వివరాలను తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాలను పూర్తిగా పరిష్కరించామన్నారు. ఇంటింటి సర్వేలో సేకరించిన ఫారమ్ 6, 7, 8లను మరొక్క రోజులో పూర్తి చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు.
ఎపిక్ కార్డులకు సంబంధించి ఫేజ్–1 పూర్తి అయిందని ఫేజ్–2,3లకు సంబంధించి పోస్టల్ ద్వారా డిస్పాచ్ చేస్తున్నట్లు వివరించారు. దీనిలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత, మార్కాపురం సబ్‌కలెక్టర్, నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.


