కరోనా తర్వాత వీరికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండేళ్ల పాటు కనీస ఉపాధి కరువైంది. 2021లో వ్యాపారం అంతంతమాత్రంగానే సాగిందని, గత ఏడాది పర్వాలేదని రాథోడ్ కుటుంబం చెబుతోంది. ఈ ఏడాది పండగకు మరో నాలుగు రోజుల సమయమే ఉన్నా ఇప్పటి వరకు హడావుడే కనిపించడం లేదని ఒకింత ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాల తయారీకి అప్పులు తెచ్చామని, బొమ్మలు అమ్మకపోతే బతికేదెలా అంటూ వాపోతున్నారు. ప్రస్తుతం విగ్రహాల తయారీలో పోటీ పెరిగింది. పక్క జిల్లాల్లో మూడు నెలల ముందు నుంచి విగ్రహాలు తయారు చేసి తక్కువ ధరకు విక్రయించి వచ్చిన కాడికి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా వంశపారపర్యంగా తయారు చేసే వారు ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి.