
లబ్ధిదారులకు బుక్‌లెట్ అందిస్తున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు
రాచర్ల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల్లో ఆర్థిక స్వాతంత్రం వచ్చిందని ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు అన్నారు. మండలంలోని యడవల్లి సచివాలయం చర్లోపల్లె, యడవల్లి గ్రామాల్లో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారనే విషయం మీకు తెలుసన్నారు. ఇంటింటికీ వెళ్లి సచివాలయ పరిధిలో అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. మీ ఇంటికి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి లబ్ధితో పాటు ఇంకా మీకు కావాల్సిన, తీర్చావల్సివి సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అంటూ.. అడిగారు. సంక్షేమ పథకాలు ఇంటి ముంగిటకే అందుతున్నాయని ప్రజలు తెలిపారు. ఇచ్చిన హామీల్లో 95 శాతం నెరవేర్చి చేతల ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా కుల, మత, వర్గ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంక్షేమ పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఎంపీపీ షేక్ ఖాశింబీ, జెడ్పీటీసీ పగడాల దేవి, శ్రీరంగం, యడవల్లి ఎంపీటీసీ భనవం ధనమ్మ, జేఏసీ మండల కన్వీనర్ బెల్లం నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యేలం మురళీకృష్ణ, రామాపురం సొసైటీ అధ్యక్షుడు మదిరె శ్రీరంగారెడ్డి, యడవల్లి మాజీ సర్పంచ్ బైర్ల లలితమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు భవనం కోటేశ్వర్‌రెడ్డి, యన్నం లక్ష్మీరెడ్డి, షేక్ మునాఫ్, బైర్ల దేవదాసు, మొర్రి తిరుపతమ్మ, ఏ శేఖర్‌రెడ్డి, ఉసా నారాయణ, సూర పాండురంగారెడ్డి, ఎంపీడీవో కె.కవితా చౌదరి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాసులు, ఏఈ చిన్న అబ్బాయి, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే అన్నా రాంబాబు