క్షేత్రస్థాయిలో పారదర్శక పాలన

● మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
● త్రిపురాంతకంలో గడప గడపకు మన ప్రభుత్వం
త్రిపురాంతకం: గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారదర్శకమైన పాలన క్షేత్రస్థాయిలోనే అందిస్తున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. త్రిపురాంతకంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. త్రిపురాంతకం చెరువుకు పైప్‌లైన్ ద్వారా సాగర్ జలాలు అందించడం, శిథిలమైన గెస్ట్ హౌస్ స్థానంలో నూతన అతిథి గృహ నిర్మాణం, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, షాదీఖానా స్థలానికి 20 సెంట్ల కేటాయింపు వంటి వాటిని ప్రత్యేకంగా పరిశీలించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ త్వరలో స్థలాలు అందిస్తామని సురేష్ హామీ ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందించేందుకు సచివాలయ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో వచ్చిన సమస్యలపై సిబ్బంది స్పందించి పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పథకాలను ప్రజలకు సక్రమంగా అందించాలని సురేష్ కోరారు. త్రిపురాంతకంతో పాటు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్‌కుమార్ దృష్టికి మంత్రి సురేష్ తీసుకెళ్లారు. షాదీఖానా పై తగిన ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. మిగిలిన ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళుతున్న మంత్రి సురేష్ ...కలెక్టర్ దినేష్‌కుమార్, సబ్ కలెక్టర్ సేతు మాధవన్ లను శాలువలు, పూలమాలలతో సత్కరించారు. వీరి వెంట ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆర్ సుశీల వెంకట పిచ్చయ్య, వైఎస్సార్ సీపీ కన్వీనర్ ఎస్ పోలిరెడ్డి, గ్రామసర్పంచ్ పొన్న వెంకటలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు దగ్గుల గోపాల్‌రెడ్డి, దేవాలయాల ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ పద్మజ మల్లికార్జున్, పార్టీ నాయకులు నక్క చిన్నత్రిపురారెడ్డి, రంగబాబు, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, సత్యనారాయణరెడ్డి, లింగయ్య, బాలకోటిరెడ్డి ఉన్నారు.