
విశాఖ: కాకినాడ జీజీహెచ్ రంగరాయ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అత్యంత అమానుష ఘటనపై వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఇది ఏపీలో జరిగిన కీచక పర్వమని మండిపడ్డారు. ల్యాబ్ అసిస్టెంట్ కల్యాణ్ చక్రవర్తి.. మహిళల శరీర ఫోటోలు తీసి పంపడం అత్యంత దారుణమన్నారు. దీన్ని అడ్డం పెట్టకని నెలరోజులక పైగావారిని వేధింపులకు గురి చేయడమే కాకుండా బెదిరింపులకు సైత పాల్పడ్డారని మండిపడ్డారు.
ఈ ఘటనపై శుక్రవారం(జూలై 11) ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన వరుదు కళ్యాణి.. ‘ ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తేవకపోతే కనుమరుగు అయ్యేది. మహిళలు మీద చెయ్యి వేస్తే తాటా తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు?, 50 మంది మహిళలను నెల రోజుల నుంచి వేధిస్తే ఏమి చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. 50 మంది మహిళలను వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నేతల మద్దతుతో మహిళలు, చిన్నారులపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ దుర్మార్గాలు హోమ్ మంత్రి అనిత కంటికి కనిపించవా?, పోలీస్ వ్యవస్థను కక్ష సాధింపు చర్యలక ప్రభుత్వం వాడుకుంటుంది’ అని విమర్శించారు.
నలుగురు సస్పెన్షన్
కాకినాడ జీజీహెచ్ మెడికల్ కాలేజ్ ఘటనలో నలుగుర్ని సస్పెండ్ చేశారు. వైద్య విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్ చేశారు. ఈ నలుగురిపై కేసు నమోద చేసి దర్యాప్త చేపట్టారు పోలీసులు.