బాబూ.. నిత్య కళ్యాణ్‌!

Tweet war between Minister Amarnath and Pawan Kalyan - Sakshi

మంత్రి అమర్‌నాథ్, పవన్‌ మధ్య ట్వీట్‌ వార్‌ 

సాక్షి, అమరావతి: జనసేన  అధినేత పవన్‌ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ల మధ్య బుధ­వారం ట్వీట్స్‌ వార్‌ కొనసాగింది. ‘దేశంలో అత్యస్పంత సంపన్న సీఎం ‘క్లాస్‌ వార్‌’ గురించి మాట్లా­డటం దౌర్భాగ్యం. రాష్ట్రానికి వైసీపీ పెట్టుబడులు ప్రవాహాన్ని తెచ్చింది కదా.. ఇక ఎవరికి కావాలి ఈ దావోస్‌.. మన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఎప్పుడో నూడిల్స్‌ సెంటర్, టీ స్టాల్స్‌ ప్రారస్పం­భించేశారు. సీఎం ‘క్లాస్‌ వార్‌’ అంటూ కామ్రేడ్‌ చా­రు­మజుందార్, కామ్రేడ్‌ నాగిరెడ్డి, కామ్రేడ్‌ పుచ్చ­లపల్లి  వంటి వారి గురించి మాట్లాడతారు. ఏమిటీ దౌ­ర్భా­గ్యం!’ అంటూ పవన్‌  వరుస ట్వీట్లు చేశారు. దీనికి మంత్రి అమర్‌నాథ్‌ ట్విట్టర్‌ ద్వారానే ప్రతి స్పస్పం­దించారు.

‘బాబూ నిత్య కళ్యాణ్‌.. చారూ మజుస్పం­­దార్, పుచ్చలపల్లి లాంటి పెద్దపెద్ద పేర్లు ఎందుకుగానీ.. మీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్‌ప్లే.. అన్నీ ఒక్కడే కదా? ఆ నారా జమీందార్‌ జీవిత చరిత్ర చదు­వుకో! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా­ర్టీలు చదివే ప్రభు­త్వ బడిలో ఇంగ్లిష్‌ మీడి­యం పెట్టడానికి వీల్లే­దని.. అమరావతి భూముల్ని పేదలకు పంచితే సా­మా­జిక అసమతౌల్యం వస్తుందని వాదిస్పం­చిన బాబు బ్యాచ్‌ది క్లాస్‌ వార్‌ కాదా?  ఇతర రాష్ట్రాల కంటే వేగస్పంగా 2022 ఆర్థిక సంవత్సరంలో ఏపీ జీఎస్‌డీపీ 11.43% ఎలా చేరుకుంది? తలసరి ఆదాయంలో 2019లో 18­వ స్థానం నుంచి 2021­లో 9వ స్థానానికి ఎలా ఎగబాకింది? ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో వరుసగా మూడేళ్లు ఎలా అగ్రస్థానంలో నిలిచింది? ఇవి కేంద్ర  గణాస్పంకాలు. మీ నిరాధార ఆరోపణలు, ప్రశ్నలతో మీరు రాష్ట్ర కృషిని కించపరుస్తున్నారా?’ అం­టూ మంత్రి తన ట్వీట్లతో పవన్‌పై మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top