
తిరుపతి జిల్లా: ‘సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఏమో కానీ ‘తెలుగు తమ్ముళ్ల తోపులాట’ కార్యక్రమం మాత్రం సజావుగా సాగుతోంది. ఈరోజు(శనివారం, జూలై 12) తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండల కేంద్రంలోని టీడీపీ ఆఫీస్ వద్ద సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించగా అది రసాభాసాగా మారింది. టీడీపీ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ శంకర్‌రెడ్డి ఎదుట తెలుగు తమ్ముళ్ల తోపులాట చోటు చేసుకుంది.
టీడీపీలో తనకు గౌరవం ఇవ్వడం లేదంటూ మాజీ ఎంపీపీ బట్ట రమేష్ ఆందోళనకు దిగారు. తనకు ఎందుకు గౌరవం ఇవ్వడం లేదని రమేష్ డిమాండ్ చేశారు. పార్టీలు మారే రమేష్‌ను గౌరవించేది లేదంటూ మరో వర్గం సైతం ఆందోళనకు దిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా తోపులాటకు దారి తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
యార్లగడ్డ వర్సెస్ పొట్లూరి
కృష్ణాజిల్లాలోని గన్నవరం కేసరపల్లి వేదికగా తెలుగు తమ్ముళ్ల వర్గపోరు బయటపడింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వర్సెస్ మాజీ ఏఎంసీ చైర్మన్ పొట్లూరి బసవరావు వర్గాలుగా తెలుగు తమ్ముళ్లు విడిపోయారు. ఇది కూడా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన అంశమే కావడం గమనార్హం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి గ్రామంలో ఎమ్మెల్యే యార్లగడ్డ. పర్యటిస్తున్న సమయంలో యార్లగడ్డ పర్యటనను బసవరావు వర్గం బాయ్‌కాట్ చేసింది.
గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద బసవరావు వర్గం సమావేశమైంది. దాంతో పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. పార్టీ కోసం కష్టపడితే గెలిచాక ప్రక్కకి నెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం గ్రామ పార్టీ నాయకులు, ,కార్యకర్తలు. ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తే తమకు సమాచారవ ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. గ్రామ పార్టీ కమిటీ రద్దు చేయకుండా కొత్తవారిని ఎలా ఎన్నుకుంటారని బసవరావు వర్గం నిలదీసింది.ఎమ్మెల్యే యార్లగడ్డ వైఖరిపై అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని అంటున్నారు.
గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తూ కనీస సమాచారం ఇవ్వరా?????
గ్రామ పార్టీ కమిటీ రద్దు చేయకుండా కొత్తవారిని ఎలా ఎన్నుకుంటారు.