
అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఘన స్వాగతం పలుకుతున్నారు. రోజంతా ప్రజలతో మాట్లాడింది రికార్డ్ చేసుకోండి. మీకు దమ్ముంటే
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాగుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అభివృద్ధి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు.
చదవండి: నారాయణ ‘లీక్స్’: చంద్రబాబుకు మైనస్.. ఎలాగంటే?
‘‘గడప గడప’’ను ప్రజలు అడ్డుకుంటున్నారంటూ.. టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. ప్రజల్లో టీడీపీ వాళ్లు కూడా ఉంటారు.. వారే ప్రశ్నించి వారే ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ జరిగేదంతా భూతద్దంలో చూపుతున్నారు. పథకాలు అందుతున్నాయా లేదా.. అని ప్రజలనే అడుగుతున్నాం. అందరూ సంతృప్తిగా ఉన్నారు. ఘన స్వాగతం పలుకుతున్నారు. రోజంతా ప్రజలతో మాట్లాడింది రికార్డ్ చేసుకోండి. మీకు దమ్ముంటే ఆ వీడియోలను విడుదల చేయండని’’ టీడీపీకి సజ్జల సవాల్ విసిరారు. దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట’’ అంటూ దుయ్యబట్టారు.
‘‘విద్యుత్ మీటర్లను శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేస్తున్నాం. నువ్వు ఏనాడైనా ఉచిత విద్యుత్ ఇచ్చావా...?. ఇప్పుడు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. మీటర్లు పెట్టడం వల్ల కేంద్రం నుంచి మనకు మేలు జరుగుతుంది. రైతులను ఇబ్బంది పెట్టలేదు. చెప్పిన అబద్ధం మళ్లీ మళ్లీ చెప్పి నమ్మించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.